ఏలూరులో అకస్మాత్తుగా బయటపడిన అనారోగ్య సమస్యను అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. దిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్ నేతృత్వంలో కమిటీని నియమించింది.
సభ్యులుగా పూణే జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ సంకేత కులకర్ణిని నియమించింది. రేపు ఉదయానికి ఈ బృందం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి న్యూ దిల్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సంప్రదించి.. సమస్యకు గల కారణాలు తెలుసుకుంటుందని చెప్పారు.
సంబంధిత కథనాలు:
ఏలూరు: ప్రజలకు అస్వస్థతపై సీఎం సమీక్ష.. సమస్యపై ఆరా
ఏలూరు బాధితులను పరామర్శించిన సీఎం జగన్
'స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'