ETV Bharat / city

సమాచార మార్పిడిపై జాగ్రత్త

డిజిటల్​ మాధ్యమాల్లో సమాచారాన్ని ఇతరులతో పంచుకునే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్​ మీడియా విభాగం సంచాలకులు కొణతం దిలీప్​ సూచించారు. వాట్సప్‌ వంటి వేదికల్లో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తే.. ఆ బృందపు అడ్మిన్స్‌పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

beware of whats app groups
వాట్సాప్​ గ్రూప్లతో జాగ్రత్త
author img

By

Published : Mar 31, 2020, 2:49 PM IST

డిజిటల్‌ మాధ్యమాల్లో మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని, అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ మీడియా విభాగం సంచాలకులు కొణతం దిలీప్‌ సూచించారు. మానవాళికి అత్యంత ప్రమాదకరంగా మారిన కరోనా విషయంలో సంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌, వాట్సప్‌, షేర్‌చాట్‌, టిక్‌టాక్‌ తదితర సామాజిక మాధ్యమాలు, ఇంకా వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్స్‌లను ఉపయోగిస్తున్నారు. కొందరు అవగాహన లోపం, ఆకతాయితనం వల్ల తప్పుడు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింప చేస్తున్నారన్నారు. వాట్సప్‌ వంటి వేదికల్లో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తే ఆ బృందపు అడ్మిన్స్‌ దానికి బాధ్యులవుతారని, చట్టపరంగా చర్యలు తప్పవని తెలిపారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు..

  • కరోనా వంటి మహమ్మారిని రూపుమాపడంలో సమాచార మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటికి తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున ధన్యవాదాలు. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిలో ఉన్న సంచలనాత్మక, భయాందోళనలకు గురిచేసే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కొన్ని ప్రధాన స్రవంతి వార్తాపత్రికల ఆన్‌లైన్‌ ఎడిషన్లు, వెబ్‌ మ్యాగజైన్లు, ఆన్‌లైన్‌ న్యూస్‌ సైట్లు యథాతథంగా ప్రచురిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలు తమ యూట్యూబ్‌ ఛానెళ్లలో ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తున్నాయి.
  • ఇంకా కొన్ని ఛానళ్లు చాలా వార్తలను పోస్ట్‌ చేస్తున్నాయి. సంబంధిత వార్తకు, సమాచారానికి సంబంధం లేనివి వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారాన్నీ కలుషితం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని అవహేళన చేసేలా, వారిపై చులకన భావం కలిగించేదిగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఈ వీడియోలు ఉంటున్నాయి.
  • పదేపదే ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించే.. వీడియోలను ప్రసారం చేసే వేదికలపై డిజిటల్‌ మీడియా విభాగం సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ వెబ్‌సైట్లు, ఛానళ్లకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేసే అవకాశం ఉంటుంది. తరచుగా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడే సామాజిక మాధ్యమ సంస్థలను పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది.
  • ఇలాంటి వార్తలు, వీడియోలు తెలంగాణ అంటువ్యాధులు (కోవిడ్‌-19) నిబంధనలు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్‌, ఐపీసీ సెక్షన్‌ 505 కింద ఉల్లంఘనలుగా పరిగణిస్తాం. పైచట్టాలే కాకుండా ఇతర నిబంధనలను అనుసరించి ఆ సంస్థలు/ సంస్థల యజమానులు శిక్షార్హులవుతారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.