ETV Bharat / city

మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణపై అప్పటివరకు చర్చ లేనట్లే..!

YSRCP leaders on cabinet reshuffle: ఏపీ మంత్రి మండలి పునరుద్ధరణపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల 4 వరకు మంత్రిమండలి మార్పుపై చర్చ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 1న అమావాస్య కావడంతో అప్పటివరకు ఏ కొత్తపని చేయరని.. ఆ తర్వాత ఉగాది పండగ, ఆదివారం రావడంతో పునరుద్ధరణపై చర్చించడం కుదరదని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.

discussion on cabinet reshuffle
మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణపై చర్చ
author img

By

Published : Mar 26, 2022, 11:19 AM IST

Cabinet reshuffle: మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణపై ఏప్రిల్‌ 4 వరకు చర్చ ఉండకపోవచ్చని వైకాపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ‘ఏప్రిల్‌ 1న అమావాస్య కావడంతో అంతకుముందు.. కొత్తగా ఏ పని చేయరని, ఆ మరుసటి రోజు ఉగాది, తర్వాత రోజు ఆదివారం కావడంతో మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం లేకపోవచ్చు’ అని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 4న గుంటూరు జిల్లా నరసరావుపేటలో వాలంటీర్లకు నిర్వహించే సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్నారు. అందువల్ల ఏప్రిల్‌ 4 తర్వాతే మంత్రిమండలిపై చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శ్రీరామనవమికి కొత్త మంత్రిమండలి కొలిక్కి వస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ సీఎం కార్యాలయ వర్గాలు దాన్ని కొట్టి పారేస్తున్నాయి.

ముగ్గురే ఉంటారా? : ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రుల్లో ముగ్గురిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. సామాజికవర్గం పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ ముగ్గురిని కొనసాగించే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత మంత్రుల్లో మహిళలు ముగ్గురుండగా.. కొత్త మంత్రివర్గంలో వీరి సంఖ్య 5కు పెరుగుతుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: cm jagan review : ఈ నెల 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.