ETV Bharat / city

చంద్రబాబుపై సీబీఐ విచారణ కోరతాం: వైకాపా ఎంపీలు

ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అబద్ధాలతో కూడిన వినతిపత్రాన్ని తెదేపా ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు అందజేశారని ఆరోపించారు.

author img

By

Published : Feb 5, 2021, 10:47 AM IST

chandrababu
chandrababu

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, తిరుపతిలో అమిత్‌షా కారుపై చేసిన దాడిని ప్రజలు మర్చిపోలేదని వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ రాజకీయాల కోసం చంద్రబాబు కొత్తగా హిందూ మత జపం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 12 దేవాలయాల్లో దాడులకు సంబంధించిన కేసుల్లో తెదేపా కార్యకర్తలున్నారని డీజీపీ చెప్పారన్నారు. అమరావతి తాత్కాలిక రాజధాని కట్టడానికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 500 మంది కూర్చొనే భవనాలకు కలిపి చంద్రబాబు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.

కొత్తగా 1500 మంది కూర్చొనే పార్లమెంటు భవనానికి రూ.976 కోట్లు ఖర్చవుతోందంటే ఎంత దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 30 శాతంలోపే అయ్యాయని, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 నెలల్లో 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్త రథాన్ని తయారు చేయించిందన్నారు.

ఇదీ చదవండి:

విభజన హామీలకు నేటికీ అతీగతీ లేదు.. బడ్జెట్​లోనూ చిన్న చూపే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.