ETV Bharat / state

భక్తుల ప్రశాంతతకు భంగం కలగొద్దు - వీఐపీ హడావుడి కనిపించకూడదు : చంద్రబాబు - CHANDRABABU REVIEW ON TIRUMALA - CHANDRABABU REVIEW ON TIRUMALA

తిరుమలలో వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

cm_chandrababu_naidu_review_meeting_in_tirumala
cm_chandrababu_naidu_review_meeting_in_tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 10:57 AM IST

Updated : Oct 5, 2024, 1:12 PM IST

CM Chandrababu Naidu Review Meeting in Tirumala : ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు తిరుమలలో పర్యటించారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

తిరుమల కొండపై గోవిందనామస్మరణ తప్ప మరోమాట వినిపించకూడదని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావివ్వొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన రెండోరోజు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్షించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు.

టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలని ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల సూచనల ఆధారంగా టీటీడీ సేవలు అందించాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సూచనలు తీసుకోవాలని దేవదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని ఇదే విధానం ఎల్లప్పుడూ కొనసాగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని చంద్రబాబు సూచించారు.

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు - cm chandrababu tirumala tour

Vakulamatha kitchen Started in Tirumala : తిరుమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అటవీప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలన్నారు. అటవీసంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని అధికారులకు సీఎం సూచించారు. కొండపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి తప్ప హంగూ ఆర్భాటం, అనవసర వ్యయం వద్దన్నారు.

భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చేవారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భక్తులు సంతృప్తితో, ఆధ్యాత్మిక అనుభూతితో తిరుమల పర్యటన ముగించుకుని వెళ్లాలే టీటీడీ చర్యలు ఉండాలని సూచించారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం ప్రారంభించారు.

చిన్నశేష వాహనంపై వెంకన్నస్వామి- ఒక్కసారి దర్శిస్తే సమస్త నాగ దోషాలు పరార్​! - Chinna Sesha Vahanam

Last Updated : Oct 5, 2024, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.