Rajasthan Cyber Gang Arrested : డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి వారి నుంచి రూ.లక్షలు కాజేస్తున్న ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్లు రమేశ్, శ్రవణ్‌కుమార్‌లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు.
ఓ విశ్రాంత ఆచార్యుణ్ని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.74 లక్షలు దొచుకున్న కేసులో వీరిద్దర్ని రాజస్థాన్‌లో అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం వీరిని బాపట్లకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ తరహా మోసంలో నిందితులను అరెస్టు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి అన్నారు. శివప్రసాద్, ఆకాష్ కుల్హరి, రమేష్, శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ఓ సైబర్ నేరగాళ్ల బృందం ఈడీ, సీబీఐ అధికారులమంటూ అధికారులు, విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులకు ఫోన్ చేసి మనీలాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ వారిని బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరు బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన ఓ విశ్రాంత ఆచార్యుడు గొంది లక్ష్మీవరప్రసాద్‌రావుకు గత నెల డిసెంబర్ 1వ తేదీన తము ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి మనీలాండరింగ్ కేసు నమోదైనట్లు బెదిరించారు.
సీఐకి ఫోన్ చేసిన సైబర్ నేరస్థులు - డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపు
అనంతరం దశల వారీగా విశ్రాంత ఆచార్యుడు నుంచి రూ.74 లక్షలు వసూలు చేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన లక్ష్మీవరప్రసాదరావు గత నెల 3న చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఎస్సై నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.17.90 లక్షల నగదును స్తంభింపజేశామని వెల్లడించారు. అలాగే సైబర్ మోసగాళ్లలో కొంతమంది ముంబయి, రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకోవటానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.
'మేం పోలీసులకు భయపడం - డబ్బులు ఇవ్వం, అరెస్ట్ చేస్తారా చేయండి'
చుండూరు సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం రాజస్థాన్‌కు, అలాగే ఆర్‌ఐ శ్రీకాంత్ నేతృత్వంలో మరో బృందం ముంబయికు పంపించామన్నారు. రాజస్థాన్‌కు వెళ్లిన బృందం ఈ కేసులో మూడో నిందితుడు అయిన రమేష్‌ను పట్టుకుని అతని వద్ద నుంచి రూ.2 లక్షలు, అదేవిధంగా నాలుగో నిందితుడైనా శ్రవణ్‌కుమార్ నుంచి రూ.5 లక్షలు రికవరీ చేశామని వివరించారు. మహారాష్ట్రకు వెళ్లిన మరో బృందం మొదటి ఇద్దరు నిందితుల కోసం గాలిస్తోందన్నారు. పట్టుకున్న నిందితుల నుంచి 11 చెక్‌బుక్‌లు, 24 ఏటీఎం కార్డులు, నాలుగు సెల్‌ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. ఈ సైబర్ ముఠా 18 రాష్ట్రాల్లో రూ.10 కోట్ల మేర ఇలా కాజేసినట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అని వివరించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.12కోట్లు లూటీ- ఆధార్ స్కామ్ అంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ట్రాప్