ETV Bharat / state

"వైఎస్సార్ జిల్లా" పేరు మార్చండి - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ - Satya Kumar Letter to Chandrababu

వైఎస్సార్‌ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ముఖ్యమంత్రికి లేఖ

Satya Kumar Letter to Chandrababu
Satya Kumar Letter to Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 11:14 AM IST

Updated : Oct 5, 2024, 12:17 PM IST

Satya Kumar Letter to Chandrababu : ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్సార్‌ కడపగా గెజిట్‌లో మార్పు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడపని చెప్పారు. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తనవలే తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కోసం తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని సత్యకుమార్ గుర్తుచేశారు.

అప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడి శ్రీవారిని దర్శిస్తుండడం ఆచారంగా మారిందని సత్యకుమార్ లేఖలో తెలిపారు. కానీ గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కడప జిల్లా పేరును వైఎస్సార్‌ జిల్లాగా మార్చిందని అన్నారు. ఈ పరిణామంపై శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నాయని తెలిపారు. భయంతో వారు అభిప్రాయాలు వ్యక్తం చేయలేదని సత్యకుమార్ చెప్పారు.

Satya Kumar Letter to Chandrababu
"వైఎస్సార్ జిల్లా" పేరు మార్చండి - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ (ETV Bharat)

Satya Kumar on YSR District : అసెంబ్లీలో తాను ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సత్యకుమార్ గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్​రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషిచేశారని పేర్కొన్నారు. ఆ విషయం ఎవరూ కాదనలేరని చెప్పారు. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌ జిల్లాగా ఉన్న ఈ జిల్లాను వైఎస్సార్‌ కడపగా మార్చాలని చంద్రబాబుకు రాసిన లేఖలో సత్యకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

బీమాపై మరింత ధీమా - వైద్య సేవలు మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం కసరత్తు - health insurance

రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలి: మంత్రి సత్యకుమార్‌ - Satyakumar Met Union Ministers

Last Updated : Oct 5, 2024, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.