ETV Bharat / city

తొలిదశ ఓటమిని చంద్రబాబు వేడుక చేసుకుంటున్నారు: సజ్జల - ఏపీ పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 3,245 పంచాయతీల్లో 2,640 చోట్ల వైకాపా మద్దతుదారులే గెలిచారని వెల్లడించారు. తొలిదశ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని సజ్జల పేర్కొన్నారు.

ysrcp leaders sajala comments on chandra babu
చంద్రబాబుపై సజ్జల వ్యాఖ్యలు
author img

By

Published : Feb 12, 2021, 6:45 PM IST

తొలిదశ ఓటమినీ చంద్రబాబు వేడుక చేసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. తొలిదశలో 1,055 పంచాయతీలు గెలిచామని చంద్రబాబు చెప్పారన్న సజ్జల... ఇప్పుడు ఎస్ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 3,245 పంచాయతీల్లో 2,640 చోట్ల వైకాపా మద్దతుదారులు గెలిచారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ysrcppolls.in వెబ్‌సైట్‌లో గెలిచిన వైకాపా మద్దతుదారుల వివరాలున్నాయని చెప్పారు.

24 మంది వైకాపా తిరుగుబాటుదారులు గెలిచారన్న సజ్జల... 510 చోట్ల మాత్రమే తెదేపా మద్దతుదారులు గెలిచారని స్పష్టం చేశారు. తొలిదశలో 95 చోట్ల ఇతర అభ్యర్థులు గెలిచారని... తెదేపా గెలిచిన మద్దతుదారుల ఫొటోలను బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. 82 శాతం పైగా వైకాపా మద్దతుదారులు గెలిచారని ఉద్ఘాటించారు. కుప్పంలో కూడా వైకాపాకు ఫలితాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.