ETV Bharat / city

'అమరావతిలో ఉద్యమం చేసేది రైతులు కాదు'

author img

By

Published : Feb 25, 2020, 5:14 PM IST

అమరావతిలో ఉద్యమం చేస్తోన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని వైకాపా నేత పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్​ను లక్ష్యంగా చేసుకుని తెదేపా కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు.

Ysrcp Gowtham Reddy On Amaravathi Farmers
అమరావతి నిరసనలపై పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాఖ్య

అమరావతి నిరసనలపై పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు

అమరావతిలో ఉద్యమం చేస్తోన్న వారిలో రైతులు ఎవరూ లేరని.. వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని వైకాపా నేత పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్​ను లక్ష్యంగా చేసుకుని అమరావతిలో ఉద్యమం చేస్తున్నారని.. వైకాపా ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఈ తరహా ఉద్యమం మానుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో వైకాపా రాష్ట్ర స్థాయి ట్రేడ్ యూనియన్ల సమావేశం జరిగింది. సీఎం జగన్ తలపెట్టిన అభివృద్ది వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో ప్రదర్శనలు, సభలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలని తీర్మానించినట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

'స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల'పై హైకోర్టులో వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.