రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన 649 మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) స్థానాల్లో 626 వైకాపా చేజిక్కించుకుంది. తెదేపా 8, జనసేన, సీపీఎం చెరో ఒక స్థానాన్ని సాధించాయి. స్వతంత్రులు ఐదు చోట్ల ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. 8 మండలాల్లో ఎన్నికలు నిరవధిక వాయిదాపడ్డాయి. శుక్రవారం వాయిదా వేసిన 15 ఎంపీపీ స్థానాల్లో శనివారం ఏడు చోట్ల ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన ఎనిమిది మండలాల్లో కోరంలేక అధికారులు వాయిదా వేశారు.
ఇదీ చూడండి: Ap new cabinet: కొత్త మంత్రిమండలి కూర్పుపై మంతనాలు షురూ