వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సాయానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2 లక్షల 36 వేల 344 మందికి రెండో విడత ఆర్థిక సాయం చేయనున్నారు. అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈబీసీ, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా ఈ నిధులు విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 4వ తేదీన నిధులు విడుదల కానున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం