ETV Bharat / city

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం చేయూత..వాహన మిత్ర ప్రారంభం - jagan

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకం నేడు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించారు.

వాహన మిత్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
author img

By

Published : Oct 4, 2019, 8:13 PM IST

వాహన మిత్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకం నేడు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

విజయవాడలోని తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు వాహనమిత్రను ప్రారంభించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, కలెక్టర్‌ ఇంతియాజ్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వాహనమిత్రను ప్రారంభించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వాహనమిత్రను ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులను అందించారు.

శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మంత్రి కృష్ణదాస్‌ వాహనమిత్రను ప్రారంభించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు జయరాం వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. అనంతపురంలోని అంబేడ్కర్‌ భవన్‌లో మంత్రి శంకరనారాయణ ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు నాలుగు నెలల్లోనే ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం అందించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కడప కలెక్టరేట్​లో వాహన మిత్రను ప్రారంభించగా... ఉప ముఖ్యమంత్రి చెక్కులు అందజేశారు.

విశాఖ గురజాడ కళాక్షేత్రంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ పథకంలో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా నుంచి ఎక్కువమంది లబ్దిదారులుగా నిలిచారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయడం... వారిలో ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా నింపుతుందన్నారు. ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు పది వేల ఆర్ధిక సాయం అందించే వాహన మిత్రను తూర్పుగోదావరి జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించి... చెక్కులను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

ఇవీ చూడండి-మాట ఇచ్చా.. నిలబెట్టుకున్నా.. న్యాయం చేస్తా: సీఎం జగన్

Intro:AP_VJA_34_04_BSC_NURSING_CANDIDATES_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( )గ్రామ వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శుల ఉద్యోగాలకు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలో అర్హత సాధించి కాల్ లెటర్ అందుకున్నాక, అధిక విద్యార్హత ఉందంటూ తమను అనర్హులుగా పేర్కొన్నారని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల అభ్యర్థులు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది బిఎస్సి నర్సింగ్ అభ్యర్థులు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యి ఉత్తీర్ణత సాధించారు. గ్రామ సచివాలయం లో ఏ ఎన్ ఎం, ఎంపీఇవో, హార్టికల్చరల్ ప్రభుత్వ ఉద్యోగాలకు, బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అనర్హులని ,పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన నియామక పత్రాలు ఇవ్వకుండా తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అందరూ అర్హులే అంటూ చెప్పి తీరా పరీక్షలయ్యాక బిఎస్సి నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు అని చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బైట్... సిద్ధార్థ రెడ్డి

Body:AP_VJA_34_04_BSC_NURSING_CANDIDATES_PC_AVB_AP10050

Conclusion:AP_VJA_34_04_BSC_NURSING_CANDIDATES_PC_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.