ETV Bharat / city

YS Sharmila Padayatra: తెలంగాణలో షర్మిల పాదయాత్ర.. ముహుర్తం ఖరారు - YS Sharmila.

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు.నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని..,చేవెళ్లలో ప్రారంభించి చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.

author img

By

Published : Sep 20, 2021, 6:50 PM IST

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతుందని.. జీహెచ్​ఎంసీ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 12-15 కి.మీ మేర పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించి.. చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.

'' తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత దళితులపై దాడులు 800 శాతం పెరిగాయి. మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయి. బంగారు తెలంగాణ కాస్త...బీరుల తెలంగాణ అయింది. కొత్త కొలువులు ఉండవు..ఉన్న వాటికి భరోసా ఉండదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై పోరాటం చేసేందుకే ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేయబోతున్నాను. ఈ పాదయాత్ర (Praja Prasthanam Padayatra) లో ప్రజల సమస్యలు విని... వారితో కలిసి పోరాడుతాను. సుమారు ఏడాదిపాటు పాదయాత్ర (Praja Prasthanam Padayatra) ఉంటుంది. కేసీఆర్​కు భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎలా అమ్ముడుపోయాయో పాద యాత్రలో ప్రజలకు చెబుతాం. ప్రతి పల్లెకు వెళ్లి.. ప్రతి గడపా తడతాం.''

-వైఎస్‌ షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

పాదయాత్రలకు వైఎస్​ఆర్ బ్రాండ్ అంబాసిడరని...ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేవెళ్ల నుంచి ప్రారంభించి చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల (YSRTP President YS Sharmila) వెల్లడించారు.

ఇదీ చదవండి

సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.