ETV Bharat / city

Lady Cheater: మాయలే(లా)డి వలపు వలలో చిక్కి సూసైడ్ యత్నం - Cheating in the name of love in warangal

మాయలే(లా)డి మాయలో పడిన ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఫ్రెండ్ షిప్​ పేరు మీద బాధితుడితో ఓ యువతి సన్నిహితంగా మెలిగింది. తనతో పాటు మరో ఇద్దరిని ఫోన్​లో పరిచయం చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పరిచయమైన మరో ఇద్దరు కూడా ఈమె అవతారమే. అదెలాగంటారా ?

మాయలే(లా)డి వలపు వలలో చిక్కి సూసైడ్ యత్నం

author img

By

Published : Aug 18, 2021, 9:59 PM IST

స్నేహం చాటున మాయ ప్రేమకు మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన మైలపాక సందీప్ అనే యువకుడు గీసుగొండ మండలం మచ్చపూర్ గ్రామానికి చెందిన స్రవంతి అనే యువతి మాయమాటలకు (Lady Cheater) మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

స్నేహితురాలిగా పరిచయమైన స్రవంతి.. సందీప్​ను మచ్చిక చేసుకుని తనకు ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్నారని నమ్మబలికింది. సదరు స్నేహితులతో ఫోన్​లో మాట్లాడాలని సందీప్​ను కోరింది. అసలు మర్మం తెలియని సందీప్ ఆ ఇద్దరి అమ్మాయిలతో విడివిడిగా ఫోన్​లో మాట్లాడాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని స్రవంతి నమ్మబలికి ప్రియురాళ్ల అవసరాల నిమిత్తం సుమారు రూ. లక్ష వసూలు చేసింది.

డబ్బులు ఇచ్చేటప్పుడు ఎందుకు అని సందీప్ అడగగా... నీతో ప్రేమలో ఉన్న ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని దానికి కారణం నువ్వే అని స్రవంతి చెప్పడంతో.. భయాందోళనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇందులో అసలు విషయం ఏంటంటే... మాయ లేడి స్రవంతియే మరో ఇద్దరిలా మాట్లాడింది. ఈ విషయం తెలియని సందీప్..సూసైడ్ అటెంప్ట్ చేశాడు.

ఇదీ చూడండి: Child marriage: కాసేపట్లో పెళ్లి... అధికారుల ఎంట్రీతో ఆగిపోయింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.