ETV Bharat / city

పద్మశ్రీ రావడం కలా... నిజమా అన్నట్లు ఉంది: యడ్ల గోపాలరావు - పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం వార్తలు

పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం కలా... నిజమా అన్నట్టుగా ఉందని శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన రంగస్థల నటుడు యడ్ల గోపాలరావు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి దాదాపు నాలుగున్నర దశాబ్దాలకుపైగా నాటకరంగానికి సేవలందించారు గోపాలరావు. 5,500కు పైగా నాటకాలు ప్రదర్శించిన ఆయనను... గతంలో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, కందుకూరి విశిష్ట పురస్కారాలతో సత్కరించింది. తాను పోషించిన పాత్రల్లో నారదుడి పాత్ర తనకెంతో ఇష్టమని గోపాలరావు అంటున్నారు. 'ఈటీవీభారత్'​తో ముచ్చటించిన ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.

yedla gopalrao express his happines get  padmasri award
yedla gopalrao express his happines get padmasri award
author img

By

Published : Jan 26, 2020, 4:59 PM IST

ఈటీవీభారత్​తో యడ్ల గోపాలరావు

ఈటీవీభారత్​తో యడ్ల గోపాలరావు

ఇదీ చదవండి : 'తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం'

Intro:పద్మశ్రీ అవార్డు కు ఎంపికైన యడ్ల గోపాలరావు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన రంగస్థల నటుడు, పద్య నాటక కళాకారుడు యడ్ల గోపాలరావు కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలో రంగస్థలంపై అడుగుపెట్టి నాలుగున్నర దశాబ్దాలకు పైగా రసజ్ఞ ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపాలరావు కు పద్మశ్రీ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. *వ్యవసాయ కుటుంబం నుంచి తల్లి లక్ష్మమ్మ ,తండ్రి రామ్మూర్తి లా ప్రథమ కుమారుడు గోపాల్ రావు చిన్నతనం నుంచే సాంఘిక నాటికలు మక్కువతో పాఠశాల దశలోనే పోలు నాటికలను ప్రదర్శన చేపట్టారు. గురువు ఎడ్ల సత్యం ప్రోత్సాహంతో పౌరాణిక నాటక రంగ ప్రవేశం చేశాడు. సత్యహరిచంద్ర లో నక్షత్రక పాత్ర, శ్రీకృష్ణార్జున యుద్ధం, గయోపాఖ్యానం లో శ్రీకృష్ణుని పాత్ర, రామాంజనేయ యుద్ధం లో రాముని పాత్ర, శ్రీకృష్ణతులాభారం లో నారదుని పాత్ర తో ప్రదర్శన చేపట్టారు. సత్యహరిచంద్ర లో నక్షత్ర పాత్ర ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈయనను కలిగిన నక్షత్ర క అనే బిరుదు వచ్చింది. * 5500 నాటకాలు పైగా ప్రదర్శనలు. చిన్నతనంలో నాటికలు ను ప్రదర్శన చేపట్టిన గోపాలరావు పదహారేళ్ల ప్రాయం పౌరాణిక నాటక రంగంలో ప్రవేశించి 55 ఏళ్ల సుదీర్ఘ కాలంలో 5500 పైగా పౌరాణిక నాటకాలు లో పలు పాత్రలను పోషించారు . ఆంధ్ర , తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు కలకత్తా, చెన్నై ,బెంగళూరు , బళ్లారి, బిలాస్పూర్, రాయగడ, గోరక్ పూర్ ,బరంపురం తదితర ప్రాంతాల్లో కూడా ప్రదర్శన చేపట్టి ప్రేక్షకుల మన్ననలు పొందారు. . * ఎన్నో అవార్డులు సన్మానాలు. *1989లో ఏలూరు దర్బార్ సంస్థ సంగీత నట చక్రవర్తి బిరుదుతో సత్కరించింది. * 1999లో పశ్చిమ గోదావరి జిల్లా సా గట్ల ఉత్సవ కమిటీ బంగారు కంకణాలు, అభినవ శ్రీరామ బిరుదుతో సత్కరించారు *2000 లో గుంటూరు లో ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు బంగారు హస్తభూషణం తో సత్కరించి కలియుగ నక్షత్ర క అనే బిరుదు ప్రదానం చేశారు. * 2006లో శ్రీకాకుళంలో రంగస్థల కళాకారులు చే నట సవ్యసాచి బిరుదు ప్రధానం. * *2010లో శ్రీకాకుళం ఇంటాక్ సంస్థ వారిచే చట్టి పూర్ణయ్య పంతులు పురస్కారం. *2013లో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ప్రాంతీయ రంగస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పౌరాణిక నాటక బ్రహ్మ బిరుదుతో సత్కారం. * *2014లో మందలో 50 సంవత్సరాలు నాటక జీవిత స్వర్ణోత్సవాల సందర్భంగా సినీ రచయిత నటుడు తనికెళ్ల భరణి తో సువర్ణ పుష్పాభిషేకం సత్కారం. * *2015లో. అనంతపురం లో లో లో లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో బళ్ళారి రాఘవ అవార్డు తో సత్కారం. *2015లో రాజమండ్రి నంది నాటకోత్సవాలు 2014 సంవత్సరం సంబంధించి చి తుది న్యాయనిర్ణేతగా నియామకం. *2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రస్థాయి కందుకూరి విశిష్ట పురస్కారం. * 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నంది అవార్డు బహుకరణ. * ఎంతో గుర్తింపు తెచ్చిన పాత్ర నక్షత్రక సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర పాత్ర ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆయన ప్రదర్శించిన నాటకాల్లో 3500 పైగా నాటకాలు నక్షత్ర పాత్ర పోషించారు. ఆయన గాత్రం ఒక అమృతం. ఆయన మాధురి యమైన గాత్రంతో ప్రేక్షకులను మెప్పించి కలియుగ నక్షత్ర క అనే బిరుదును కూడా పొందారు. తనకు ఇష్టమైన పాత్ర నారద పాత్రని ఆయన చెబుతున్నారు. *ఎంతో మంది సీనియర్ కళాకారులతో ప్రదర్శనలు. రాష్ట్రములోని ఎంతోమంది ప్రసిద్ధి చెందిన ప్రముఖ కళాకారులతో ఆయన ఎన్నో ప్రదర్శనలు చేపట్టారు. ఆయన మూడు తరాల కళాకారులతో ప్రదర్శన చేపట్టినట్లు ఆయన చెబుతున్నారు. పీసపాటి నరసింహమూర్తి ,షణ్ముఖ ఆంజనేయులు ,డివి సుబ్బారావు, అమరపు సత్యనారాయణ ,రామారావు, జయరాజ్, విజయ్ రాజ్, ఉయ్యూరు గోపాలస్వామి ,కె నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కేవీ రెడ్డి ,గూడూరు సావిత్రి ,గుమ్మడి గోపాలకృష్ణ ,పి లక్ష్మణరావు తదితర ఎంతో మంది సీనియర్ కళాకారులతో కలిసి ఆయన ప్రదర్శనలు చేపట్టారు. *సంతోషకరంగా ఉంది : యడ్ల గోపాలరావు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల యడ్ల గోపాలరావు ఎంతో సంతోషకరం గా ఉందని ఆయన తెలిపారు. చిన్నతనం నుంచే పౌరాణిక నాటకాలంటే మక్కువతో నాటకరంగంలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలంలో కళామతల్లికి ఎంతో సేవ చేసిన నాకు కేంద్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. నాటకరంగంలో మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు


Body:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల గోపాలరావు కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ప్రభుత్వం అవార్డు ప్రకటన పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు


Conclusion:శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల గోపాలరావు కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ప్రభుత్వం అవార్డు ప్రకటన పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.