అమరావతి ప్రాంతంలో వైకాపా కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మద్దతుగా రైతుల దీక్షా ప్రాంగణం వద్ద నినాదాలు చేశారు. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా సాగిన ప్రదర్శన రైతుల దీక్షా శిబిరం వద్దకు వచ్చేసరికి వైకాపా కార్యకర్తలు ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ అన్నదాతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులను భారీగా మోహరించడంతో ర్యాలీ ముందుకు సాగింది.
ఇవీ చదవండి: సూచీలు ఢమాల్.. 1200 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్