ETV Bharat / city

'చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారు' - ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాజా వార్తలు

కాకినాడ డీఆర్సీ ఘటన విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. చిన్నపాటి భేదాభిప్రాయాలను వక్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ycp mp subhash chandra bose
ycp mp subhash chandra bose
author img

By

Published : Dec 4, 2020, 7:38 PM IST

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తనకు మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చి సమసిపోయాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఏదో వెనుకబడిన కులానికి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించటం సరైంది కాదన్నారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలను చంద్రబాబు కొండంతలా చేసి మాట్లాడటం దుర్మార్గమన్నారు.

జక్కంపూడి, బోసు స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ నిక్కచ్చిగా ఉంటారని.. ఆయనంటే మాకందరికీ అభిమానమని చెప్పారు. కాకినాడ డీఆర్సీ సమావేశంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. బోస్ మా ఇంటికి వస్తే కూడా రాజకీయం చేస్తున్నారని..కుటిల రాజకీయం చేయవద్దని చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

డీఆర్సీ సమావేశంలో రసాభాస... వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.