ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇసుక సమస్య ఉందనేది వాస్తమేనని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల్లో 90 శాతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాటా ఉందని ఆరోపించారు. సమస్య పది శాతం ఉంటే కేవలం ప్రతిపక్షాల హడావుడితో కార్మికులు సందిగ్ధంలో పడిపోతున్నారని అన్నారు. నేతల తీరుతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : కాలువలోకి దూసుకెళ్లిన కారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!