సీఎం జగన్ ఎస్‌ఈసీపై అనవసర ఆరోపణలు చేశారని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేయగానే కంగారుపడి.. ఎస్‌ఈసీపై అక్కసు వెళ్లగక్కారని ఆక్షేపించారు. సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడా చుక్కెదురైందని ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా కరోనాపై భయభ్రాంతులకు గురవుతున్నారని.. కరోనా వ్యాప్తి నివారణపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని యనమల ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై ప్రపంచ నేతలే ఎప్పటికప్పుడు వివరాలు ఇస్తున్నారని... ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: