సీఎం జగన్ ప్రత్యేక హోదా పేరెత్తడం మర్చిపోయారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. సంజాయిషీలు చెప్పడానికే సీఎం జగన్ దిల్లీ పర్యటనలు తప్ప, రాష్ట్రానికి రావాల్సినవి సాధించడానికి కాదని ఆరోపించారు. కుంభకోణాలపై ఉన్న శ్రద్ధ.. కేంద్రనిధులు రాబట్టడంపై వైకాపా ప్రభుత్వాని లేదని ధ్వజమెత్తారు. కోర్టులో ఉన్న అమరావతి అంశంపై, పదేపదే కేంద్రాన్ని ఒత్తిడి చేయడం గర్హనీయమని విమర్శించారు.
పదహారు నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం సాధించారో రాష్ట్ర ప్రజలకు తెలపాల్సిన బాధ్యత సీఎంపై ఉందని యనమల అన్నారు. రూ. లక్షా 28వేల కోట్ల అప్పులు తేవడమే జగన్మోహన్ రెడ్డి రికార్డని ఎద్దేవా చేశారు. ఆస్తులు కొల్లగొట్టడంపై తప్ప సమాజంలో ఆస్తుల కల్పనపై వైకాపా ప్రభుత్వానికి దృష్టి లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: దిల్లీలో పలువురు ఎంపీలను కలిసిన అమరావతి మహిళా జేఏసీ