ETV Bharat / city

'కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది'

కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని యనమల ఆరోపించారు. వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు ఎందుకు కొనరు..? అని ప్రశ్నించారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Yanamala criticize jagan's Government over corona Failure
యనమల రామకృష్ణుడు
author img

By

Published : Apr 4, 2020, 1:56 PM IST

కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. మెడ్‌టెక్ జోన్‌పై చేసిన ఆరోపణలపై ప్రజలకు వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు ఎందుకు కొనరు..? అని ప్రశ్నించారు.

కేంద్ర నిబంధనలు, లాక్‌డౌన్‌కు వైకాపా నేతలే తూట్లు పొడుస్తున్నారని యనమల ఆరోపించారు. ఈ సమయంలో ఇసుక తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద వెంటనే పంటఉత్పత్తులు కొనుగోలు చేయాలన్న యనమల... ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండీ... ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.