yanamala: కొత్త ఏడాదిలోనైనా రాష్ట్ర ఆర్థికస్థితిని చక్కదిద్దే దిశగా కార్యాచరణను ముఖ్యమంత్రి చేపట్టకపోవడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండున్నరేళ్ల పాలన దుష్ఫలితాలపై కనీసం సమీక్షించలేదని తప్పుబట్టారు. కొత్త ఏడాదిలోనూ ఇవే వైఫల్యాలు ఎదురైతే ఈ రాష్ట్రాన్ని బాగుచేయడం ఎవరివల్ల కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూలోటు 918 శాతం ఎగబాకితే.. ద్రవ్యలోటు 388 శాతానికి పెరిగిపోయిందన్నారు. ప్రత్యేక హోదాపై కనీసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదని అన్నారు. పోలవరం, అమరావతి పనులన్నీ పూర్తిగా నిలిపివేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
ఇదీ చదవండి: TDP Leader Anagani on Cine Industry : సినీరంగ పెద్దలు మాట్లాడరేం ? -అనగాని సత్యప్రసాద్