ముఖ్యమంత్రి జగన్‌ది సున్నా వడ్డీ పథకం కాదని.... సున్నా పరిపాలన అంటూ తెలుగుదేశం సీనియక్ నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. బకాయిలను ఎగ్గొట్టి కేవలం 2019-20కి మాత్రమే సున్నా వడ్డీ నిధులు విడుదల చేయడం దిగజారుడుతనమని ఆక్షేపించారు. ఇది డ్వాక్రా మహిళలను దారుణంగా మోసగించడమేనని మండిపడ్డారు. ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే.. వైకాపా నేతలు మాత్రం పార్టీ ప్రచారం కోసం పాకులాడుతున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: 'కరోనా నేర్పిన అతిపెద్ద పాఠం.. స్వయం సమృద్ధి'