ETV Bharat / city

మహిళలూ తెలుసుకోండి... ఈ చట్టాలు మీకోసమే.. - women rites in india

మన దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి సరైన అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మహిళల కోసం మన దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

womens day special
womens day special
author img

By

Published : Mar 8, 2020, 8:01 AM IST

  • వ్యభిచార నిరోధక చట్టం(1956): మహిళలను వ్యభిచార రొంపిలోకి లాగకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.
  • మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం(1986): మహిళలను కించపరిచేలా అడ్వర్టయిజ్‌మెంట్‌, బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి దీని ద్వారా నిరోధించారు.
  • వరకట్న నిషేధ చట్టం(1961): వివాహానికి ముందుకానీ, వివాహం తర్వాత కానీ వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడాన్ని ఇది నిషేధిస్తుంది.
  • గర్భ నిరోధక నివారణ చట్టం(1971): మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా గర్భవిచ్ఛిత్తికి ఒత్తిడి చేయకుండా వారికి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
  • ముస్లిం వివాహాల రద్దు చట్టం(1939): తన వివాహాన్ని రద్దు చేసుకునే హక్కుని ముస్లిం స్త్రీలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
  • విడాకులు పొందిన ముస్లిం మహిళల రక్షణ చట్టం(1939): భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం స్త్రీల హక్కులు కాపాడేందుకు ఈ చట్టం చేశారు.
  • కుటుంబ న్యాయ స్థానాల చట్టం(1984): కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఈ చట్టం కింద ఏర్పాటు చేశారు.
  • లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం(1987): దీని ద్వారా ప్రభుత్వం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది.
  • హిందూ వివాహ చట్టం(1955): ఈ చట్టం ప్రకారం హిందూ మహిళ వివాహం, విడాకుల విషయంలో పురుషుడితో సమాన హక్కులు కలిగి ఉంటుంది. ఈ చట్టం ఏకపత్ని విధానం, కొన్ని సందర్భాల్లో స్త్రీ తన భర్త నుంచి విడాకులు పొందే హక్కు కల్పిస్తుంది.
  • సతి నిరోధక చట్టం(1987): భర్త మరణిస్తే అతడి భౌతికకాయంతో పాటు భార్యను బలవంతంగా చితిపై దహనం చేసే అనాగరిక చర్య నుంచి మహిళలకు ఇది రక్షణ కల్పిస్తుంది.
  • మహిళలకు కనీస వేతన చట్టం(1948): లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషుడి కంటే తక్కువ నిర్దేశించరాదు.
  • ఫ్యాక్టరీ చట్టం(1948): గనులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే స్త్రీలతో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పని చేయించరాదు.
  • హిందూ వారసత్వ చట్టం(1956): ఈ చట్టాన్ని 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషుడితో సమాన హక్కు ఉంది.
  • భారతీయ క్రిస్టియన్ వివాహాల చట్టం(1872): క్రైస్తవ వివాహాలు, విడాకులకు సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరిచారు.
  • సమాన వేతన చట్టం(1976): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు వేతనాలు తగ్గించరాదు.
  • మాతృత్వ ప్రయోజనాల చట్టం(1961): పనిచేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది.
  • లైంగిక వేధింపుల నిరోధక చట్టం: మహిళలు, తాము పనిచేస్తున్న చోట లైంగిక వేధింపులకు గురైతే వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లే ! కావాలని శరీరాన్ని తాకడం, సైగలు చేయడంతోపాటు మాటలు, పాటలు వంటివి లైంగిక వేధింపుల కిందికి వస్తాయి. వీటిని అరికట్టేందుకు 1997లో సుప్రీంకోర్టు విశాఖ కేసులో కొన్ని సూచనలు చేసింది. (ఏఐ ఆర్ 1997 సుప్రీంకోర్టు 3011) ఈ తీర్పులోని అంశాలను మార్గదర్శక సూత్రాలుగా పాటించడం సంస్థలకు తప్పనిసరైంది.)
  • గృహహింస నిరోధక చట్టం(2005): ఎవరైనా కుటుంబ సభ్యులు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, శారీరక, మానసిక, మాటలతో వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
  • నిర్భయ చట్టం (2013): 2012 డిసెంబర్​లో దిల్లీలో అత్యాచారానికి గురై ఒక మహిళ మృతి చెందినప్పుడు ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో అమ్మాయిలు, మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. యాసిడ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాల్ని తీసుకురావాలని గత ప్రభుత్వాలు ఈ చట్టాల్ని తీసుకువచ్చాయి. మహిళలపై జరుగుతున్న దాడులు లైంగిక దాడులు వేధింపులు, కిడ్నాప్, హింస ఈ చట్టం కిందకు వస్తాయి.
  • మహిళా చట్టం (2013): లైంగిక వేధింపుల నుంచి మహిళల రక్షణకు చట్టసభలు శాసనం చేసేవరకు ఈ మార్గదర్శక సూత్రాలు అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధ, పరిష్కార) చట్టం - 2013ను రూపొందించింది.
  • ప్రత్యేకంగా మహిళా కమిషన్: ప్రభుత్వం మహిళా, శిశురక్షణ, హక్కుల్ని పర్యవేక్షించేందుకు ఒక ఛైర్​పర్సన్​, ఆరుగురు సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమాజంలోని మహిళల సమానత్వం, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కమిషన్ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులపై విచారణ కొనసాగిస్తుంది. మహిళల వేధింపులు, దాడులు, వివక్షలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.