పెళ్లి పేరిట రూ.కోటికి పైగా వసూలు చేసిందంటూ తెలంగాణలో ఓ ఎన్‌ఆర్‌ఐ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఐపీ అడ్రస్ ఆధారంగా మే 27న ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.65 లక్షలు మోసపోయానంటూ మరో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలతో ఇద్దరినీ మోసం చేసింది ఒకరేనని తేలింది. పూర్తి వివరాలను రాబట్టేందుకు మంగళవారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
హబ్సిగూడకు చెందిన మరో వ్యక్తిని కూడా ఇదే తరహాలో బురిడీ కొట్టించి రూ.3.5 కోట్లు టోపీ పెట్టినట్లు గుర్తించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.500, రూ.1300, రూ. 2,500 మాత్రమే ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. బాధితుల్లో ఏ ఒక్కరూ ఆమెను వ్యక్తిగతంగా కలవలేదు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో అందరమైన అమ్మాయిల ఫొటోలను ఉంచి ముగ్గులోకి దించింది. కుమారుడు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించారు. కాజేసిన డబ్బులతోనే సొంతంగా ఓ చోట గోశాల నిర్వహిస్తున్నట్లు పోలీసులకు చెప్పడం గమనార్హం.