తీవ్ర వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా తేరుకోక ముందే రాష్ట్రాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 నుంచి 5.8 కిలోమీటర్ల పరిధిలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వివరించారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర్లో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.
సోమవారం కోస్తాలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: జన్యుపరంగా స్థిరంగానే వైరస్!