ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు పడ్డాయని తెలిపింది.
వెంకటగిరిలో అత్యధికంగా 7 సెంటీమీటర్లు.. మదనపల్లె, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, గుర్రంకొండ, పోరుమామిళ్ల, జమ్మలమడుగులో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:
కరోనా టీకా తీసుకున్న హోంమంత్రి.. ప్రజలు అపోహలు వీడాలని పిలుపు