ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు... ఎప్పుడు ఏం జరిగిందంటే..? - ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం హీటెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్‌ఈసీ అంటుంటే.. అసలు ఎన్నికలు ఇప్పట్లో వద్దనే వాదన వినిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా...రోజురోజుకూ వేగం పెంచుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను మరోమారు వేగవంతం చేసింది ఎస్​ఈసీ. ఇవాళ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతేడాది ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్​ నుంచి ఇవాళ్టి వరకు జరిగిన పరిణామాలెంటో చూద్దాం...!

ap local polls 2021
ap local polls 2021
author img

By

Published : Jan 23, 2021, 5:32 PM IST

  • మార్చి 7, 2020 - రాష్ట్రంలో స్థానిక సంస్థల(ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల షెడ్యూల్ జారీ
  • మార్చి 9 - పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్
  • మార్చి 15- రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
  • అక్టోబర్ 27 - రాష్ట్ర వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య కమిషనర్ కాటమనేని భాస్కర్లతో ఎస్​ఈసీ గంటల పాటు చర్చలు. కొవిడ్ విస్తృతి, తీసుకుంటోన్న చర్యలపై చర్చ.
  • అక్టోబర్ 28 - స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్​ఈసీ రాజకీయ పార్టీలతో వరుస భేటీలు.. అభిప్రాయాలను సేకరించి కోర్టుకు నివేదన
  • నవంబర్ 3 - ఎన్నికల కమిషన్​కు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించాలని హైకోర్టు కీలక తీర్పు
  • నవంబర్ 17 - ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేసిన ఎస్​ఈసీ. సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన
  • నవంబర్ 18 - గవర్నర్​ను కలసి పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై చర్చించిన ఎస్​ఈసీ
  • నవంబర్ 18 - జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలతో వీడియోకాన్ఫరెన్స్​కు ఎస్​ఈసీ ప్రయత్నం. హాజరు కాని కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలు
  • నవంబర్ 18 - కొవిడ్ వల్ల పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని ఎస్​ఈసీకి సీఎస్ లేఖ
  • నవంబర్ 19 - మరోమారు వీడియో కాన్ఫరెన్స్​కు ఎస్​ఈసీ ప్రయత్నం. ప్రభుత్వం నుంచి అనుమతి లేక రెండుసార్లూ పాల్గొనని సీఎస్ సహా అధికారులు.
  • నవంబర్ 23 - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ.
  • డిసెంబర్ 4 - కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మాణం.
  • డిసెంబర్ 5 - ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని తప్పుపడుతూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాసిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
  • డిసెంబర్ 18 - రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు. గవర్నర్​ను మరోమారు కలిసిన ఎస్​ఈసీ
  • డిసెంబర్ 18 - ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు దిక్కరణ పిటిషన్‌ దాఖలు
  • డిసెంబర్ 23 - పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో... ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని పేర్కొంటూ హైకోర్టు ఆదేశం. న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత మూడు రోజుల్లో ఎన్నికల కమిషనర్ నిర్ణయించిన ప్రదేశం, సమయంలో సంప్రదింపుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని అధికారులు హాజరుకావాలని స్పష్టం
  • డిసెంబర్ 23 - తీర్పుపై ఉత్తర్వులు వెల్లడించిన హైకోర్టు
  • 2021 జనవరి 5 - ఎస్​ఈసీ నుంచి ప్రభుత్వానికి అందిన ఉత్తర్వులు
  • జనవరి 8- ఎస్​ఈసీతో సమావేశమైన సీఎస్ సహా ఉన్నతాధికారుల బృందం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీకి స్పష్టం
  • జనవరి 8 - పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • జనవరి 9 - పంచాయతీ ఎన్నికలు నిలపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • జనవరి 11 - ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్​ జడ్జి తీర్పు
  • జనవరి 11 - సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్​కు వెళ్లిన ఎస్​ఈసీ
  • జనవరి -18 - విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
  • జనవరి 21- ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిస్తూ హైకోర్టు(ఉదయం 10.30 గంటలకు) తీర్పు
  • జనవరి 21- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్​ఎల్​పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • జనవరి 21- తమ వాదనలు వినాలంటూ సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన ఎన్నికల సంఘం
  • జనవరి -23- పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల
  • జనవరి 25- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్​ఎల్​పీపై విచారణ జరిగే అవకాశం

ఇదీ చదవండి

ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. పలువురు అధికారుల గైర్హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.