ETV Bharat / city

'పోలీసులు ఏం చేస్తున్నారు... దిశచట్టం అమల్లో ఉందా..?'

author img

By

Published : Aug 6, 2020, 4:34 PM IST

రాష్ట్ర పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముస్లిం, దళిత, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే దిశచట్టం అసలు అమల్లో ఉందా..? అన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు.

What are the police doing..is the law enforced ..? says chandrababu

చంద్రబాబు ట్వీట్ చేసిన వీడియో

రాజమహేంద్రవరం రూరల్​లో అభంశుభం తెలియని ముస్లిం బాలికపై ముగ్గురు వైకాపా యువకులు అత్యాచారయత్నం చేయడాన్ని... తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

16 ఏళ్ల దళిత బాలికపై 12 మంది గ్యాంగ్​రేప్ చేసిన దుర్ఘటన కళ్లముందే ఉందని... కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్​రేప్ చేశారని... ఇన్ని ఘటనలు జరుగుతుంటే దిశచట్టం అసలు అమల్లో ఉందా..? అన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితుల వీడియోను చంద్రబాబు ట్విట్టర్​లో పెట్టారు.

ఇదీ చదవండీ... వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై కేటగిరి భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.