రాష్ట్రంలో ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ తుపాను.. సోమవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది దక్షిణి ఒడిశా, ఉత్తర ఏపీ నుంచి పశ్చిమ దిశగా గంటకు 8 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ ఒడిశా , దక్షిణ ఛత్తీస్‌గఢ్, విశాఖ పట్నం మీదుగా ఉన్న రుతుపవన ద్రోణి ప్రభావంతో.. మంగళ, బుధ వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి:
GULAB CYCLONE: గులాబ్ కుదిపేసింది..పంట నష్టాన్ని మిగిల్చింది