MLA Somireddy Comments On Ys Jagan : జగన్ అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొంటాను అంటే కుదరదని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న 11 మంది అసెంబ్లీకి రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక విద్యార్థి పరీక్షలకు గైర్హాజరైతే ఆయన్ను పాస్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శాసనాలు చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు పంపించారని తెలిపారు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రాకుండా ప్రజాప్రతినిధులు ఇంట్లో అలిగి కూర్చుంటారా? అని మండిపడ్డారు. బడ్జెట్ చర్చలో భాగంగా శానససభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ఇంట్లో జరిగినవి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ధనం ఖర్చు చేసి ఎన్నికలు నిర్వహించి చట్ట సభకు పంపించిందని గుర్తుచేశారు. అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా రానంటే చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ చెప్పుకొచ్చిన జగన్ వారిని నిండా ముంచారని సొమిరెడ్డి వ్యాఖ్యానించారు. వారికి కట్టిన ఇళ్లు అన్నీ పెచ్చులు ఊడుతున్నాయని ఆక్షేపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దారుణమైన దోపిడీ జరిగిందని అన్నారు. రీ సర్వే గురించి ఎవరు అడిగారని, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులపై ఆయన బొమ్మ వేసుకోవడం ఏమిటని సోమిరెడ్డి మండిపడ్డారు.
ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా? - అది ప్రజలే ఇవ్వాలి:సీఎం చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గమని సోమిరెడ్డి అన్నారు. దీనిపై విజిలెన్సు విచారణ జరుగుతోందని తెలిపారు. జగన్ హయాంలో ఐఏఎస్ అధికారులకే దిక్కులేదని ఇక విశ్రాంత అధికారులకు ఏం అధికారం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ అనుకూలంగా ఉందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా బడ్జెట్ - ఎమ్మెల్యేల ప్రశంసలు
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వంలో 25వేల ఎకరాల భూమి అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం. భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుంది. కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉంటాయి. పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తీసుకొస్తున్నాం. మదనపల్లెలో 13 వేల ఎకరాల్లో పేర్లు మార్చారు. అక్కడి భూ అక్రమాల్లో ఎవరున్నా శిక్షిస్తాం’’ అని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
'జగన్‌ను జీవితకాలం జైల్లో పెట్టినా తప్పు లేదు' - రుషికొండ అంశంపై సభ్యులు