ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఈ ప్రభావంతో శని, ఆదివారం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించారు. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. నైరుతి మధ్యప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న గుజరాత్ ప్రాంతాల్లోని అల్పపీడనం బలహీనపడిందని వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని