ETV Bharat / city

'ఎన్ని కుట్రలు చేసినా డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలిస్తాం' - perni Nani comments on house deeds

ఎన్ని కుట్రలు చేసినా డిసెంబర్ 25న రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు పంపిణీ చేస్తామని... రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వీటిని ఓర్వలేకే చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.

we will give the house deeds on December 25 says perni Nani
పేర్ని నాని
author img

By

Published : Dec 11, 2020, 10:25 PM IST

తిరుపతి ఎన్నికలో గెలుపు చారిత్రక అవసరమని...5 శాతం ఓట్లు వస్తే చాలు అని చంద్రబాబు మాట్లాడడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. మానసిక రుగ్మతను అధిగమించేందుకు చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో దౌర్జన్యాలమయంగా ఉండగా... సీఎం జగన్ పాలన సంక్షేమమయంగా ఉందని పేర్కొన్నారు. 90 శాతం హామీలను నెరవేర్చిన జగన్​ను ప్రజలు ఎందుకు వదులుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని కుటుంబం ఎక్కడైనా ఉందా అని అన్నారు.

పోలీసులు, వైకాపా నేతలపై ప్రైవేటు కేసులు వేయాలని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి పేర్నినాని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రైతులకు పెట్టిన ఇన్​పుట్ సబ్సిడీ బకాయిలను సీఎం జగన్ చెల్లించారని... జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేదని.. రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ ౩1న నివర్ తుపాను పంట నష్టాన్ని రైతులకు అందిస్తామన్నారు.

ఇదీ చదవండీ... భూముల రీసర్వే కోసం కేంద్ర ప్రభుత్వ సాయం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.