ETV Bharat / city

సర్కారుపై లక్ష కోట్ల భారం అయినా పీఆర్​సీ ఇస్తాం: తెలంగాణ సీఎం కేసీఆర్ - Assembly sessions 2021

"కరోనా వల్ల తెలంగాణ ప్రభుత్వంపై రూ.లక్ష కోట్ల భారం పడింది. ప్రత్యక్షంగా రూ.50 వేల కోట్ల నష్టం వచ్చింది. అయినా ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో గౌరవప్రదమైన పీఆర్‌సీ ప్రకటిస్తాం. వేతనాల విషయంలో ఉద్యోగులు గర్వపడేలా చేస్తామని ఉద్యమ సమయంలో చెప్పాం. గత పీఆర్‌సీలో దాన్ని నిరూపించాం. ఈసారీ పీఆర్‌సీ ప్రకటించిన తర్వాత ఉద్యోగులపై తెరాస వైఖరి ఏమిటో దేశమంతా తెలుసుకుంటుంది." - తెలంగాణ సీఎం కేసీఆర్‌

Assembly sessions
తెలంగాణ సీఎం కేసీఆర్
author img

By

Published : Mar 18, 2021, 8:16 AM IST

పంటలను ఈ సారి కూడా కొంటామని.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కనీస మద్దతు ధర చెల్లిస్తామని, రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల గత మూడునాలుగేళ్లలో రూ.7 - 8 వేల కోట్ల నష్టం వచ్చిందని, లాభనష్టాలు చూసుకోవడానికి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మాన చర్చ సందర్భంగా శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లాడారు.

సభ్యులు సూచించిన పలు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం అన్నారు. ‘కరోనా సమయంలో ప్రతి పంటనూ కొన్నాం. అందుకు రూ.50 వేల కోట్లు ఇచ్చాం. ఈసారి కూడా కొంటాం. సుప్రీం కోర్టు స్టే వల్ల కేంద్ర వ్యవసాయ చట్టాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రస్తుతం అవి అమల్లో లేవు. ప్రధానమంత్రి మాత్రం చట్టాలు అమలైతే రైతులకు లాభం అని చెబుతున్నారు. నేను కూడా ఆయనతో మాట్లాడి అభిప్రాయం చెప్పా. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్రం చట్టం చేస్తే రాష్ట్రం అందుకనుగుణంగా పనిచేయాలి.'

ఒట్టిగ్యాస్...

కేంద్రం భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలో అది చేస్తాం. ఒకవేళ కేంద్రం చట్టాల ద్వారా మార్కెట్లు తీసేసినా...రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తాం. కొనుగోలుకు ఒక వేదిక ఉండాలి. వ్యవసాయ చట్టాలు బాగోలేకపోతే ప్రజలే అధికార పార్టీని శిక్షిస్తారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలు తీర్మానం చేశాయంటున్నారు. అది ఒట్టి గ్యాస్‌. ఎందుకంటే ఒకసారి పార్లమెంటులో ఆమోదించి చట్టం చేసిన తరవాత దానికి భిన్నంగా రాష్ట్ర శాసనసభలు మళ్లీ చట్టాలు చేయలేవు.

కొట్లాడుతాం...

కేంద్ర ప్రభుత్వంతో ప్రతి దానికీ గొడవపడబోం. అవసరమైతే కొట్లాడతాం. రాజ్యాంగబద్ధమైన సంబంధాలు కొనసాగిస్తాం. రాష్ట్రంలో ధాన్యం భారీగా రాబోతోంది. ఈ ఏడాది 80 లక్షల క్వింటాళ్ల ధాన్యం తీసుకుంటామని ఎఫ్‌సీఐ చెప్పింది. కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తాం. రైతులు కూడా పొల్లు, తాలు లేని ధాన్యాన్ని తీసుకురావాలి. తేమ శాతం సరిచూసుకోవాలి. అందుకు విరుద్ధంగా ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర ఇవ్వమని అడిగితే సాధ్యపడదు.

కరోనా కేసులు పెరుగుతున్నాయి...

కరోనా కేసులు మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. విదేశాల్లో సెకండ్‌ వేవ్‌ వచ్చి తగ్గుతోంది. మన వద్ద ఇంకా సెకండ్‌ వేవ్‌ రాలేదు. అయినా గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేశంలో కంటే మన రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. కొన్ని గురుకుల హాస్టళ్లలోనూ, మంచిర్యాల పాఠశాలలోనూ కరోనా కేసులు ఎక్కువగా వచ్చాయి. పాఠశాలలను నడపాలా? వద్దా? అనే అంశంపై రెండు మూడ్రోజుల్లో చెబుతాం. పిల్లలకు హాని జరగనివ్వం.

రుణమాఫీ 100 శాతం అమలు చేస్తాం

ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీని 100 శాతం అమలు చేస్తాం. గత ఏడాదే రూ.25 వేల లోపు రుణం ఉన్న 3-4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. మిగతా వారికి కూడా అమలు చేస్తాం. బడ్జెట్‌లో ఆ విషయం గురువారం ఆర్థికమంత్రి చెబుతారు. పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో హామీ ఇచ్చి అమలుచేయలేదు. మేం మాత్రం కచ్చితంగా చేస్తాం. కిస్తీలుగా చెల్లించినా రైతులపై మాత్రం భారం పడకుండా చూస్తామని గతంలోనే చెప్పాం.

గొర్రెల సంఖ్యలో అగ్రస్థానం...

కులవృత్తులను నిలబెడుతున్నాం. గొర్రెలు, చేపపిల్లల్ని ఇస్తామంటే కొందరు నవ్వారు. రాష్ట్రంలో 77 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ఇప్పుడు 3 కోట్లున్నాయి. దేశంలో అత్యధికంగా గొర్రెలున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పింది. ప్రతి యాదవ కుటుంబానికి వాటిని ఇస్తాం. బడ్జెట్‌లో ఆ వివరాలను మంత్రి చెబుతారు. అంటరానితనం దళితులను క్షోభకు గురిచేస్తుంది. దాని నిర్మూలనకు కొత్త కార్యక్రమం తీసుకొస్తాం. బడ్జెట్‌లో వివరిస్తాం.

న్యాయవాదుల హత్యకేసు సీబీఐకి ఇవ్వం...

న్యాయవాదుల హత్య బాధాకరం. నేనూ ఖండిస్తున్నా. మా మండల పార్టీ అధ్యక్షుడు నిందితుడిగా ఉంటే వెంటనే సస్పెండ్‌ చేశాం. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకేసును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి ఇవ్వం. ఈ కేసు విచారణను హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ అత్యుత్తమమైందని గర్వంగా చెబుతున్నా.

ఈ ఏడాది నుంచే భూములపై డిజిటల్‌ సర్వే...

రాష్ట్రంలోని భూములపై సమగ్రంగా డిజిటల్‌ సర్వే చేస్తాం. ఈ ఏడాదే అమలు చేస్తాం. అక్షాంశాలు, రేఖాంశాలను నిర్ణయించడం వల్ల భూముల పేచీలు ఉండవు. ధరణి ఒక విప్లవం. 16, 17 రాష్ట్రాలు దీని గురించి తెలుసుకుంటున్నాయి. భూ దస్త్రాలు వివాద రహితంగా ఉంటే 3-4 శాతం జీడీపీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నేరాలూ తగ్గుతాయి.

రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు.. అందులో ఇప్పటికే 1.50 కోట్ల ఎకరాల భూమి ధరణిలోకి ఎక్కింది. ఇప్పుడు 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరుగుతోంది. పాస్‌బుక్‌ను కొరియర్‌ ద్వారా ఇంటికి పంపిస్తున్నాం. ఇప్పటివరకు ధరణి తర్వాత 3.30 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎమ్మార్వో కార్యాలయంలో భూముల వ్యవహారాలు జరగకూడదన్నది మా లక్ష్యం. పైరవీకారులు, లంచాలు మెక్కేవాళ్లకు ధరణి అశనిపాతంగా మారింది.

ఇంకా పింఛన్లు పెంచుతాం...

మాది వందశాతం పేదల పక్షపాత ప్రభుత్వం. పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం కొన్ని దరఖాస్తులు అపరిషృతంగా ఉన్నాయి. త్వరలో వాటిని పరిష్కరిస్తాం. మేం పొట్ట నింపేటోళ్లం.. కొట్టేటోళ్లం కాదు. 57 ఏళ్ల వయసు ఉన్నవారికి పింఛను ఇస్తామని హామీ ఇచ్చాం. అమలుచేస్తాం. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 29 లక్షల పింఛన్లు ఉంటే ఇప్పుడు 39 లక్షల మందికి ఇస్తున్నాం.

రూ.200ల నుంచి రూ.2016కి పెంచాం. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు మంచి ప్యాకేజీ...డబుల్‌బెడ్‌రూం ఇళ్లూ ఇస్తున్నాం. ప్రపంచంలోనే ఒక ప్రాజెక్టుతో తొలిసారిగా గ్రామాలు మునిగిపోతున్నట్లు ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. విజయవంతంగా అవరోధాలు దాటాం. వచ్చే జూన్‌ నాటికి నిర్మాణం పూర్తవుతుంది.

అది రాష్ట్ర గీతం కాదు...

జయజయహే తెలంగాణ అనేది రాష్ట్ర గీతం కాదు. రాష్ట్ర గీతాన్ని కూడా నిర్ణయిస్తాం. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఉండే వాళ్లు ఏ నీరు తాగుతున్నారో మిషన్‌ భగీరథ ద్వారా అలాంటి నాణ్యమైన నీళ్లను మారుమూల గూడేల్లో వారికీ సరఫరా చేస్తున్నాం. బాటిల్‌ వాటర్‌ కంటే నాణ్యమైన నీటిని ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 70 ప్రయోగశాలల్లో నీటిని ప్రతిరోజూ పరీక్షిస్తున్నాం.

-తెలంగాణ సీఎం కేసీఆర్‌

ప్రభుత్వం చెప్పిందే గవర్నర్‌ చదువుతారు...

ఎప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిందే గవర్నర్‌ చదువుతారు. అదేం కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం పరిమితికి లోబడే అప్పులు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో నివేదిక సమర్పించారు. కోటి ఎకరాల తెలంగాణ చేస్తామని చెప్పాం...ఆ దిశగానే వెళ్తున్నాం. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. పోడు భూముల సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. మేం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను ఒకే ఒక్కసారి పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు నిర్మిస్తున్నాం. 90 శాతం పూర్తయ్యాయి. దేశంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన రాష్ట్రమని కేంద్రమే పార్లమెంట్‌లో ప్రకటించింది. ఇప్పుడు ఎండాకాలమైనా 90 శాతం చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. అందుకు కారణం మిషన్‌ కాకతీయ.

నిరుద్యోగ భృతిపై ఆలోచిస్తున్నాం...

నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ అమలుపై ఆలోచిస్తున్నాం. ఈ భృతిని అనేక రాష్ట్రాలు ఇచ్చి వెనక్కిపోయాయి. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రయత్నించారు. కరోనా వల్ల ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేకపోయినం. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏం చేయాలో అది చేస్తాం. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తిచేశాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పటి ప్రధాని నెహ్రూ కూడా అభివృద్ధి చేశారు. ఆయన పేరు తుడిచివేస్తాం.. మొత్తం తీసేస్తాం అని మేం చెప్పలేదు. కాంగ్రెస్‌ పునాదులు వేయకుండా ఇంతదూరం వచ్చేవాళ్లమా. కానీ మేం చేసిన మంచి పనులు కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి ప్రేమకు నోచుకోవడం లేదు. సీఎం సమాధానాలు ఇచ్చిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

ఇదీ చూడండి:

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.