ETV Bharat / city

Tamilisai Soundararajan : ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

Tamilisai Soundararajan : తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై
author img

By

Published : Jan 26, 2022, 9:56 AM IST

Tamilisai Soundararajan : ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.. అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందన్న గవర్నర్‌... త్వరలోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా ఎదగడం సంతోషకరమని గవర్నర్ తెలిపారు. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ ఎదిగిందన్న గవర్నర్.. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత అంబులెన్స్ డ్రైవర్స్, పారిశుద్ధ్య కార్మికులతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. అంతకుముందు.. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లోని యుద్ధవీరుల స్థూపం వద్ద తమిళిసై సౌందర్‌రాజన్‌ నివాళులర్పించారు.

తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నాం. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా ఎదగడం సంతోషకరం. తెలంగాణ.. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఎదిగింది. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు.

-తమిళిసై సౌందర్‌రాజన్, తెలంగాణ గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.