ETV Bharat / city

panchayats : పంచాయతీల్లోనే నీటి నాణ్యత పరీక్షలు

తాగునీటి నాణ్యత పరీక్షలను ఇక గ్రామపంచాయతీ స్థాయిలోనే చేయనున్నారు. ఇందుకోసం 13 వేల పంచాయతీలకు ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్లు (ఎఫ్‌టీకే) కేటాయించారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు నీటి నాణ్యత పరీక్షలపై శిక్షణ ఇవ్వనున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలోని అత్యధిక పంచాయతీల్లో రెండోదశ కొవిడ్‌కి ముందే శిక్షణ పూర్తయింది.

author img

By

Published : Jun 28, 2021, 9:59 AM IST

Water quality
Water quality

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం)లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. మరోవైపు పంచాయతీ స్థాయిలోనే నీటి నాణ్యతను పరీక్షించి, లోపాలను అక్కడికక్కడే పరిష్కరించే వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు నమూనాలు తీసి పరీక్షించి, నాణ్యతలో లోపాలుంటే మండల ఇంజినీరు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పరిష్కరిస్తారు. తాగునీటిలో ఉదజని సూచిక, క్షారగుణ సాంద్రత, సంపూర్ణ కఠినత్వం, క్లోరైడ్‌, ఫ్లోరైడ్‌, ఐరన్‌ తదితరాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. లవణాల లభ్యత, మడ్డి, సల్ఫర్‌ శాతం, కాల్షియం కూడా గుర్తించి, లోపాలను సవరించొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకూ ఏం చేస్తున్నారంటే?

గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, డివిజన్‌, సబ్‌డివిజన్‌ స్థాయిలో తాగునీటి నాణ్యతను పరీక్షించే 107 ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో సిబ్బంది గ్రామ పంచాయతీల్లో ఏడాదికి రెండుసార్లు నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌ల్లో పరీక్షిస్తారు. లోపాలుంటే సమీప ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లను, పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేస్తారు. పంచాయతీ స్థాయిలో నీటి పరీక్షలు చేసినా, ల్యాబ్‌లూ పనిచేస్తాయని అధికారులు తెలిపారు. అన్ని పరీక్షలూ పంచాయతీ స్థాయిలో సాధ్యం కావని, క్లిష్టమైన వాటిని ల్యాబ్‌లో చేయాల్సి ఉంటుందని వివరించారు.

ఇదీ చదవండి: RAINS: ముంచెత్తిన వర్షాలు... కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధిక ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.