ఎగువ నుంచి వస్తున్న నీటితో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బేసిన్‌లో జలాశయాలు నిండుకుండలా మారాయి.
శ్రీశైలం జలాశయానికి తగ్గని ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,26,183 క్యూసెక్కులు... ఔట్‌ఫ్లో 3,76,432 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 10 గేట్లు ఎత్తి 3,11,790 క్యూసెక్కులు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883.20 అడుగులుగా ఉంది. జలాశయం నీటి నిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 205.66 టీఎంసీల మేర ఉంది.
పూర్తిగా నిండిన తుంగభద్ర
తుంగభద్ర జలాశయం వరద నీటితో పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 33,566 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 20,653 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1632.92 అడుగులుగా ఉంది. నీటి నిల్వకు సంబంధించి పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 100.55 టీఎంసీలుగా ఉంది.
ఆల్మట్టిలో..
ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 2,59,653 క్యూసెక్కులు కాగా.. ఒట్ ఫ్లో 2,24,839 క్యూసెక్కులుగా అధికారులు తెలిపారు.
సాగర ఘోష
ఎగువనుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,73,769 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 587.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 305.80 టీఎంసీలకు చేరింది.
ఇదీ చదవండి: