కరోనా కారణంగా ప్రయోగశాలలకు దూరమైన ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం.. ఐఐటీలు, ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలు వర్చువల్ ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. యానిమెటెడ్ డెమాన్‌స్ట్రేషన్ విధానంలో విద్యార్థులు ఇంటి వద్ద ఉంటూనే ప్రయోగాలు చేసుకోవచ్చు. వర్చువల్ ల్యాబ్స్‌పై చాలా కళాశాలలు అవగాహన కల్పించటంతో పాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
విజయవాడ, విశాఖలోని కొన్ని కళాశాలలు ఐఐటీ బాంబేతో బ్రాంచీల వారీగా వర్చువల్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కళాశాలలే కాకుండా విద్యార్థులు నేరుగా ఐఐటీల వెబ్‌సైట్లలోకి వెళ్లి ఈ సదుపాయాన్ని పొందుతున్నారు. మారుమూల ప్రాంతాలు, కళాశాలల్లో అధునాతన ప్రయోగశాలల సదుపాయం లేని విద్యార్థులకు.. వర్చువల్ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
కంపెనీల అవసరాల మేరకు నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. వర్చువల్ ల్యాబ్స్ మొదట్లో కొంత కొత్తగా ఉన్నా తర్వాత అలవాటు పడి.. సద్వినియోగం చేసుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. సాంకేతిక విద్యతోపాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఈ వర్చువల్ ప్రాక్టికల్స్ విధానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: