ETV Bharat / city

తనపై అభియోగాలు కొట్టేయాలన్న సబిత.. కౌంటర్​ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి - MP Raghurama updates

ఓఎంసీ కేసుతో తనపై నమోదు చేసిన అభియోగాలు నిరాధారమైనవని తెలంగాణ మంత్రి సబిత కోర్టుకు తెలిపారు. బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​పై విజయసాయి రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు.రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసమే పిటిషన్ దాఖలు చేశారని విజయసాయిరెడ్డి కౌంటర్​లో పేర్కొన్నారు. పిటిషన్​పై వాదనల కోసం విచారణను ఈనెల 20కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Vijayasai Reddy
విజయసాయి రెడ్డి
author img

By

Published : Aug 16, 2021, 6:30 PM IST

జగన్​ కేసుల్లో కీలక పరిణామం..

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసులపై నేడు విచారణ జరిగింది. ఓఎంసీ కేసు అభియోగాల నమోదుపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాదనలు వినిపించారు. తనపై అభియోగాలు నిరాధారమైనవని సబిత కోర్టుకు తెలిపారు. ఆ అభియోగాలను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

విజయసాయిరెడ్డి కౌంటరు దాఖలు..

బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై విజయసాయిరెడ్డి కౌంటరు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్​పై సీబీఐ కోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. తాను కోర్టు షరతులు ఉల్లంఘించలేదని.. రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసమే పిటిషన్ దాఖలు చేశారని విజయసాయిరెడ్డి కౌంటరులో పేర్కొన్నారు. లోక్​సభ సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్​కు ఫిర్యాదు చేసినందున రఘురామ రాజకీయ కక్షతో పిటిషన్ దాఖలు చేశారన్నారు. రఘురామ పిటిషన్​ను కొట్టివేయాలని విజయసాయిరెడ్డి కోరారు. పిటిషన్​పై వాదనల కోసం విచారణను ఈనెల 20కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి

vijyasai reddy bail cancel petition: కౌంటరు దాఖలు చేయాలని విజయసాయిరెడ్డిని ఆదేశించిన సీబీఐ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.