జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపైనా విచారణ చేపట్టారు. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని విజయసాయి రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. కుదరకపోతే సమాంతరంగా విచారణ చేయాలన్నారు.
మొదట విచారణ జరిపి అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైకోర్టును కోరింది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఏవి మొదట విచారించాలో స్పష్టత లేదని న్యాయవాదులు తెలిపారు. వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఈడీ కేసులపై ముందే విచారణ: సీబీఐ కోర్టు