దేశ ఆర్థిక మందగమనానికి గత, ప్రస్తుత ప్రభుత్వ విధానాలే కారణమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో విమర్శించారు. 10 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక క్షీణతకు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, విధాన పరమైన నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక మందగమనానికి మరింత కారణమయ్యాయని ధ్వజమెత్తారు. జీఎస్టీ అమలు, నోట్ల రద్దు దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయని పేర్కొన్నారు.
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు విజయసాయి రెడ్డి నాలుగు సూచనలు చేశారు. నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఎఫ్డీఐల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టిసారించాలని కోరారు. కరోనా వ్యాధి విస్తరణతో చైనా ఆర్థికంగా వెనుకబడిందన్న ఆయన... ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటే తయారీరంగంలో చైనాను అధిగమించవచ్చని వివరించారు.
ఇదీ చదవండి : ఆర్థికంగా ఆదుకోండి: సీఎం జగన్ను కోరిన తెదేపా ఎమ్మెల్యే