ప్రపంచానికే హైదరాబాద్.. బయోటెక్నాలజీ హబ్‌గా మారుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice president Venkaiah Naidu) పేర్కొన్నారు. భారత్ బయోటెక్(Bharat biotech) దేశానికి చెందింది కావడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న కొవాగ్జిన్(covaxin) టీకా ఉత్పత్తి సంస్థ భారత్ బయోటెక్‌ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. భారత్ బయోటెక్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
మన శాస్త్రవేత్తలు అనేక దేశాల ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారత్ బయోటెక్ ఇప్పటివరకు 4 బిలియన్ల టీకాల పైనే పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా 16 రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం అభినందనీయమని కొనియాడారు. జీనోమ్ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భారత్ బయోటెక్‌ను సందర్శించినట్లు వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: