రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం గం. 11:45 నిమిషాలకు విశాఖపట్నం చేరిన ఉపరాష్ట్రపతికి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏ.బి. సింగ్, మేయర్ జి.వి.హరి కుమారి, విశాఖ పోర్టు ఛైర్మన్ కె. రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్మెల్సీ పి.వి.మాధవ్‌లు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్‌కి వెళ్లారు.
నాలుగు రోజుల పాటు పర్యటనలో భాగంగా రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. అధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: