ETV Bharat / city

ఫస్ట్​క్లాస్​లో ఇంటర్​ పాసైన వీణ-వాణి.. ఎన్ని మార్కులొచ్చాయంటే..?

Inter Results in TS: నేడు విడుదలైన తెలంగాణ ఇంటర్​ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ-వాణిలు సత్తా చాటారు. ఫస్ట్​క్లాస్ మార్కులు సాధించి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ​వీణ-వాణిలకు మంత్రి సత్యవతి రాఠోడ్ అభినందనలు తెలిపారు.

author img

By

Published : Jun 28, 2022, 6:52 PM IST

Veena and Vani Inter pass
Veena and Vani Inter pass

అభివక్త కవలలు వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. తెలంగాణలో తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వీరిద్దరు ఫస్ట్​ క్లాస్​లో పాసయ్యారు. వీణ-వాణిలు గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ వెంగళ్​రావునగర్​లోని మహిళా, శిశు సంక్షేమ కార్యాలయంలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇంటర్ సెకండ్ ఇయర్​లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ వెల్లడించారు. ఇంటర్‌ సీఈసీ గ్రూపులో వీణ 712 మార్కులు, వాణి 707 మార్కులు సాధించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్.. వీణ-వాణిలకు అభినందనలు తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న అధికారులకు సైతం మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వీణ-వాణిల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున సహకారాలు ఉంటుందని చెప్పారు.

ఎమ్మెల్యే శుభాకాంక్షలు.. మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సైతం వీణ-వాణిలను అభినందించారు. శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్‌, కార్యదర్శి వేణు, విజయ్ ముదిరాజ్‌, సత్యనారాయణ, పవన్ తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.