ETV Bharat / city

ఆ కంపెనీలన్నీ జగన్​ బినామీలవే: వర్ల రామయ్య

సీబీఐ, ఈడీ కేసుల విచారణ వేగం పుంజుకోవడంతో సీఎం జగన్​కు కలవరం పెరిగిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కేసుల కంగారులో అసంబద్ధ నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యాక 30 శుక్రవారాలు వస్తే కేవలం ఒక్క శుక్రవారామే కోర్టుకు హాజరయ్యారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ తన ఆస్తులను బినామీల పేరిట పెట్టారని ఆరోపించారు.

varla ramayya
వర్ల రామయ్య
author img

By

Published : Jan 25, 2020, 8:29 PM IST

వర్ల రామయ్య మీడియా సమావేశం

తనపై ఉన్న కేసుల విచారణ ముంచుకొస్తుంటే ముఖ్యమంత్రి జగన్​మోహన్‌ రెడ్డిలో కలవరం మొదలయ్యిందని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కేసుల కంగారులో సీఎం జగన్ తానేం నిర్ణయాలు తీసుకుంటున్నారో తనకే తెలియని అయోమయస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

2012లో సీబీఐ, ఈడీలు ఛార్జ్‌షీట్లు వేస్తే ఇప్పటివరకూ జగన్‌ కేసు విచారణ సాగుతూనే ఉండటం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. సీఎం జగన్ ఆస్తులన్నీ ఆయన బినామీల పేరుతో ఉన్నాయని, ఇథోపియా ఇన్‌ఫ్రా, కేప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రాల బినామీ కంపెనీలని వర్ల ఆరోపించారు. తాడేపల్లిలోని నివాసం, బెంగుళూరులోని ప్యాలెస్‌లు జగన్‌ తన బినామీల పేరుతోనే ఉంచారని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి : 'మండలి రద్దు నిర్ణయానికి వారి చర్యలే కారణం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.