రాజధాని రైతులకు వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన ధర్నా శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పరిపాలన వికేంద్రీకరణపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేయడంతో రైతులకు ఉపశమనం చేకూరిందన్నారు. రాజధాని ఉద్యమంలో రైతులు అంతిమ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 200రోజులకు పైగా మహిళలు, రైతులు దీక్షలు చేస్తున్నా...ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఇదీ చదవండి