అమరావతి వల్ల ఒక కులం మాత్రమే బాగుపడుతోందని వైకాపా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని తెదేపా నేత వంగవీటి రాధ ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాజధానిపై కుల ప్రస్తావన తెస్తున్నారని మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా అమరావతి కోసం ప్రజలంతా పోరాడుతున్నారని తెలిపారు. వైకాపాలో ఉన్నప్పుడు తనది ఏ కులమో... ఇప్పుడు అదే కులమనే విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. రాజధాని అమరావతి ఉద్యమం అందరి ఆశ, శ్వాసగా సాగుతోందని వంగవీటి తెలిపారు.
ఇదీచదవండి