ETV Bharat / city

వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్: ఆధార్‌ లేక.. అందరికీ అందక..! - Vaccine to old people

వ్యాక్సిన్​ కోసం రిజిస్ట్రేషన్​కు ఆధార్​ తప్పనిసరి. ఈ నిబంధన... ఆధార్​ లేని వృద్ధులను టీకాకు దూరం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లోని కొంత మంది వృద్ధులకు ఆధార్​ కార్డు లేకపోవటం వల్ల వ్యాక్సిన్​ వేసేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు.

vaccine
వృద్ధులకు అందని టీకా
author img

By

Published : Jun 8, 2021, 8:17 AM IST

రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న పలువురికి ఆధార్‌ కార్డులు లేకపోవడంవల్ల వ్యాక్సినేషన్‌ ఇబ్బందికరంగా మారింది. ఆధార్‌ లేని వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యం కాదని పలు చోట్ల వైద్యారోగ్య సిబ్బంది చెబుతున్నారు. ఆధార్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో వృద్ధులు టీకాకు దూరమవుతున్నారు. వ్యాక్సినేషన్‌ సందర్భంగా టీకా తీసుకునేవారి ఆధార్‌ సంఖ్య నమోదు తప్పనిసరి. వివిధ కారణాలతో వృద్ధాశ్రమాల్లో ఉన్న కొందరికి ఆధార్‌ కార్డులు లేవు.

ఇలాంటివారికి టీకా ఇచ్చేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తుండటంతో ఆశ్రమ నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో గుర్తింపు పొందిన వృద్దాశ్రమాలు 70 ఉన్నాయి. ఇవికాకుండా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నవి మరికొన్ని ఉన్నాయి. ఆశ్రమాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది. వైద్యారోగ్య సిబ్బంది నేరుగా ఆశ్రమాలకు వెళ్లి వ్యాక్సిన్‌ ఇస్తున్నా, కొన్ని ప్రాంతాల్లో ఆధార్‌ లేని వారికి నిరాకరిస్తున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో 15 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురికి ఆధార్‌ కార్డులు లేవు. వారు వ్యాక్సినేషన్‌కు దూరమవ్వాల్సి వచ్చింది.

* కడప జిల్లా కాశినాయన మండలంలోని వివేకానంద సేవాశ్రమంలో 11 మంది వృద్ధులున్నారు. వీరిలో తొలి దశలో ఐదుగురికి టీకా వేశారు. ఇద్దరికి ఆధార్‌ కార్డుల్లేవు. ఆధార్‌ లేనిదే టీకా వేయడం సాధ్యం కాదని వైద్య సిబ్బంది చెప్పినట్లు ఆశ్రమ నిర్వాహకురాలు రామతులసి చెప్పారు.

* అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింగ్‌పల్లిలోని వృద్ధాశ్రమంలో ఆధార్‌ లేక ఇద్దరికి టీకా అందలేదు.

ఇదీ చదవండి:

కొవిడ్‌ రోగులకు సీపీఐ ఆపన్నహస్తం.. సాయం కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.