Posting to IAS usha rani: ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారిణిని ఉషారాణిని నెల రోజుల పాటు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 తేదీ నుంచి నెల రోజుల పాటు ఆమె నియామక ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు.
రెవెన్యూ శాఖలోని విపత్తు నిర్వహణ, భూ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా నవంబర్ 30 తేదీన ఉద్యోగ విరమణ చేశారు. ముఖ్య కార్యదర్శి హోదాలో ఆమెకు అన్ని వసతులు వర్తింప చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రెవెన్యూ శాఖలోని భూకేటాయంపులు, విపత్తు నిర్వహణ కు సంబంధించి కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నందున ఉద్యోగ విరమణ చేసిన.. ఆమెను తిరిగి అదే పోస్టులో నియమించినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Centre on special status for AP: ప్రత్యేక హోదా ముగిసిన అంశం.. పార్లమెంట్లో కేంద్రం