ETV Bharat / city

నాపై 28 మంది అత్యాచారం చేశారు.. అందుకు మా నాన్నే కారణం..! - up rape case

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన తండ్రి మరికొంతమందితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని 17 ఏళ్ల బాలిక మంగళవారం బయటపెట్టింది. అఘాయిత్యం చేసిన వారిలో బీఎస్పీ, ఎస్పీ నేతలు కూడా ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

up rape case
up rape case
author img

By

Published : Oct 13, 2021, 8:54 PM IST

కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 28 మంది వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ ఓ 17 ఏళ్ల బాలిక కన్నీటి పర్యంతమైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ దారుణాలకు మూలకారకుడు కావడం ప్రతిఒక్కరినీ నివ్వెరపరుస్తోంది. తన తండ్రి, బీఎస్పీ, ఎస్పీ పార్టీలకు చెందిన నేతలు, సమీప బంధువులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ జిల్లాలో ఈ కేసు నమోదైందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఆ బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం...

‘మా నాన్న ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే.. నాకు అసభ్యకరమైన చిత్రాలు చూపించి, లైంగికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నించాడు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తర్వాత నమ్మించి ఒకరోజు నాకు కొత్త బట్టలు కొనిచ్చి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ ఘటన తర్వాత మా నాన్న ఒకరోజు మత్తుమందు కలిపిన అన్నం తినిపించాడు. తర్వాత నన్ను ఒక హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై దుస్తులు లేవు. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చేవాడు. ఏ మాత్రం జాలి లేకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి తిలక్ యాదవ్ వచ్చాడు. నేను వ్యతిరేకించడంతో నీ తండ్రే పంపాడంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు’ అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది.

కాగా, బాధితురాలి ఫిర్యాదుపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను ఈ కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ బాధితురాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితి ప్రతిఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది.

ఇదీ చదవండి:

'డ్రీమ్​ 11'తో లైఫ్​ టర్న్​- ఒక్క రాత్రిలో రూ.కోటి గెల్చుకున్న ప్లంబర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.